ఆ సాంగ్ ని తీసేస్తారు అనుకున్నారు.. రాముతో మాట్లాడొద్దు అని కూడా చెప్పారు
on Jun 4, 2023
సిక్స్త్ సెన్స్ సీజన్ 5 లో జెడి చక్రవర్తి వచ్చి గేమ్ ఆడడంతో పాటు ఎన్నో విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. శివ మూవీలో "బోటనీ పాఠముంది" సాంగ్ కి అందరూ డాన్స్ చేశారు. ఈ సాంగ్ గురించి చక్రవర్తి మాట్లాడుతూ "చక్రవర్తి అనేది నా పేరు..జెడి అనేది నా ఇంటి పేరు శివలో నా క్యారెక్టర్ పేరు. శివ మూవీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ ని కూడా. బోటనీ పాఠముంది అనే సాంగ్ తో నాకు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే తెలుగు సినిమా చరిత్రలో హీరో డాన్స్ చేయడు..కానీ చాలామంది ఏమనుకున్నారంటే ఈ సాంగ్ ని సినిమాలోంచి తీసేస్తారని అనుకున్నారు. ఎందుకంటే హీరో లేకపోతే సాంగ్ ఉండదు అని. రాము గారు అప్పుడే చాలా ముందుగా ఆలోచించి ఈ మూవీ తీశారు. అందుకే శివ బిఫోర్, ఆఫ్టర్ అని అంటారు." అని చెప్పుకొచ్చారు.
"ఇక మనీ మూవీ కూడా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ మూవీలో నేను ఫస్ట్ టైం హీరోగా చేసాను. రాంగోపాల్ వర్మ గారు నిర్మాత, శివ నాగేశ్వరావు గారు డైరెక్టర్.. మనీ మూవీ రిలీజ్ కి మా దగ్గర డబ్బుల్లేవు..ఐతే అప్పటికే అందరికీ ఈ మూవీని చూపించేశాం. ఫైనల్ గా 170 , 180 షోలు కూడా అయ్యుంటాయి. ఫైనల్ గా రాము గారే సొంతంగా మూవీని రిలీజ్ చేస్తాను అని చెప్పారు. నెక్స్ట్ డే మూవీ ఓడిఎం థియేటర్ లో రిలీజ్ అయ్యింది. శివనాగేశ్వరావు గారు నాకు ఫోన్ చేశారు. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్స్ మాత్రమే ఉండేవి. నాకు ఫోన్ చేసి రాము గారిని తిట్టడం స్టార్ట్ చేశారు. నువ్వు రామ్ గోపాల్ వర్మ అంటే గురువు, దేవుడు, అదీ ఇదీ అంటావ్ ..రాము మంచివాడు కాదు, రాము చెడ్డవాడు..రేపటి నుంచి మాట్లాడ్డం మానెయ్..నాగేశ్వరావు గారు అంత ఫ్లోలో మాట్లాడ్డం నేనెప్పుడూ చూడలేదు. రాము మూవీ రిలీజ్ చేయలేదు...నేను థియేటర్ దగ్గరే ఉన్నాను. హౌస్ ఫుల్ బోర్డు పెట్టారు ..మన సినిమా హౌస్ ఫుల్ ఎందుకవుతుంది చక్రి..ఈ సాంగ్ వినేసరికి ఆ మెమొరీస్ గుర్తొచ్చాయి.." అని చెప్పారు చక్రవర్తి.